Breaking News

ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పి, టీడీపీని గెలిపించే రోజులు దగ్గరపడ్డాయి-బాదుడే బాదుడు కార్యక్రమంలో నియోజకవర్గం ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.

0 14

 రాష్ట్రంలో వైసిపి గూండా రాజ్యం నడుస్తుంది.

ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసాడు.

ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పి, టీడీపీని గెలిపించే రోజులు దగ్గరపడ్డాయి.

సప్పిపుట్టు గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో నియోజకవర్గం ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.


అల్లూరి జిల్లా, పాడేరు న్యూస్:

రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని, వైసీపీ ఆధ్వర్యంలో గూండా రాజ్యం నడుస్తోందని పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆదివారం వంతాడపల్లి పంచాయతీ సప్పిపుట్టు గ్రామంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు వైసీపీ అడ్డంకులు సృష్టించడాన్ని, అన్న క్యాంటీన్‌ భవనాన్ని ధ్వంసం చేయడాన్ని తప్పుపట్టారు. నిరుపేదల కడుపు నింపే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేయడాన్ని బట్టి వైసీపీ పరిపాలన ఎలా వుందో అర్థమవుతోందన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.వైసీపీ పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని విమర్శించారు. నేడు ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతికి బట్టకట్టలేని దుస్థితి నెలకొందన్నారు. చివరకు ఎన్టీఆర్ పాలనలో కట్టిన ఇళ్లకు కూడా జగన్ ప్రభుత్వం ఓటీఎస్ పేరిట డబ్బులు వసూలు చేస్తుందంటే రాష్ట్రంలో అరాచక పాలనను అర్థం చేసుకోవచ్చునన్నారు. వీటన్నింటినీ గమనిస్తున్న ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పి, టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రామాల్లో టిడిపి హయంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ వైసిపి అభివృద్ధి చేసినది కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బాడ సింహాచలం, సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.