కొయ్యూరు నూతన ఎస్ఐ గా రాజారావు బాధ్యతలు స్వీకరణ.
అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం:
నూతన ఎస్ఐగా రాజారావు ఈరోజు ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన దాసరి నాగేంద్రకు అనకాపల్లి జిల్లాకు బదిలీ అయిన నేపథ్యంలో కొయ్యూరు ఎస్సైగా రాజారావు బాధ్యతలు చేపట్టారు. ఎస్సై నాగేంద్ర విధుల నుండి రిలీవ్ అయి నూతన ఎస్ఐ కు బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఎస్ఐ దాసరి నాగేంద్ర, మంప ఎస్సై లోకేష్ కుమార్ నూతన ఎస్సై కు శుభాకాంక్షలు తెలిపారు.