నూతన ఎస్ఐ కి మర్యాద పూర్వకంగా కలిసిన మహిళా పోలీసులు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో ఎస్సై దాసరి నాగేంద్ర ఇటీవల ఇక్కడ విధులు నిర్వర్తించి బదిలీపై అనకాపల్లి జిల్లా వెళ్లడంతో, ఆ స్థానంలో నూతన ఎస్ఐగా రాజారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ రాజారావుకి కొయ్యూరు మండల మహిళా పోలీసులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.