గ్రామ స్థాయిలో తెదేపా బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర SC,ST కమీషన్ మాజీ సభ్యులు, అరకు నియోజకవర్గ యువనేత సివేరి అబ్రహం పిలుపునిచ్చారు..
అల్లూరి సీతారామరాజు జిల్లా ఆనంతగిరి మండలంలోని స్థానిక ప్రైవేటు హోటల్ లో మండల అధ్యక్షుడు అంటిపర్తి బుజ్జిబాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సివేరి అబ్రహం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఇప్పటినుంచే పనిచేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు తడిబరికి ఆనంద్,రెహమాన్, సమార్థి దొన్ను, మాజీ ఎంపిటిసి ధయానిధి,బిడ్డ లక్ష్మణ్,చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.