వినాయక చవితి విగ్రహ ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి: సిఐ.
అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:
వినాయక ఉత్సవాలు నిర్వహించేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సీఐ స్వామినాయుడు తెలిపారు.విగ్రహాలు ఏర్పాటు చేసే స్థలానికి సంబంధిత సర్పంచ్ సచివాలయం నుంచి, విద్యుత్ దీపాలంకరణకు విద్యుత్ శాఖ నుంచి,మైకుల కోసం పోలీస్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని చెప్పారు. అలాగే విగ్రహం నిమజ్జనం చేసే తేదీ ముందుగా స్థానిక ఎస్ఐ లకు తెలిపి అనుమతులు తీసుకోవాలని సిఐ సూచించారు.