వైద్యం అందక పుట్టిన పాప మృతి.
వివరాల్లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా,గూడెం కొత్త వీధి మండలం,దారకొండ పంచాయతీలో గల ములస వీధి గ్రామానికి చెందిన గర్భిణీ అయిన శెట్టి.పద్మ w/o శెట్టి మోహన్ రావు పురిటి నొప్పులు రావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కి,ఏఎన్ఎం కి తెలియపరచిన నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్ పంపించాలని మొరపెట్టుకున్నా సరైన టైంలో అంబులెన్స్ రాకపోవడంతో గర్భిణీ ఇంటి వద్ద డెలివరీ అయింది. పాపకు జన్మనిచ్చింది కానీ డాక్టర్ గాని,ఏఎన్ఎం గాని పట్టించుకోకపోవడం వల్ల అప్పుడే పుట్టిన పాప మరణించింది.
ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ ఉన్నప్పటికీ రిపేర్ లో ఉన్నట్లు డాక్టర్ చెప్పారని, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ఉన్నప్పటికీ డాక్టర్ మా గ్రామానికి పంపించడానికి ఇష్టం లేక పంపించడానికి కుదరదు మీరే ప్రైవేట్ వెహికల్ మీద హాస్పటల్ కి తీసుకువస్తే ట్రీట్మెంట్ చేస్తానని చెప్పారని గ్రామస్తులు తెలిపారు.
గిరిజన ప్రజల కోసం ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహాయపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్లే గిరిజన గ్రామాల్లో గర్భిణీలుగా ఉండి అనేక మంది గర్భిణీ స్త్రీలు డెలివరీ అవ్వక, డెలివరీ అయిన తర్వాత సరైన వైద్యం అందక గర్భిణీలు మరణిస్తున్నారు. వారికి పుట్టిన పిల్లలు మరణిస్తున్నారు.
ఈరోజు దారకొండ పంచాయతీ ములస వీధి గ్రామంలో సరైన వైద్యం అందక వైద్య అధికారులు నిర్లక్ష్యం వల్లే అప్పుడే పుట్టిన పసికందు మరణించింది. ఇలాంటివి ఈ ప్రాంతంలో ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు.
దీనిపై సంబంధిత అధికారులు… నిర్లక్ష్యం వహించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని దారకొండ పంచాయితీ ములస వీధి గ్రామ ప్రజలు తెలియపరుస్తున్నారు.
మరణించిన చిన్నారి దహన కార్యక్రమం అనంతరం తదుపరి చికిత్స కోసం శెట్టి పద్మను దారకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కి, ఐ టి డి ఎ పీఓ కి,డి ఎం హెచ్ ఓ కి త్వరలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
మా దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అంబులెన్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.