Breaking News

అల్లూరి విలేకర్ల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ.

0 15

 అల్లూరి విలేకర్ల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ.


అల్లూరి జిల్లా పాడేరు న్యూస్:

వినాయక చవితి పురస్కరించుకొని అల్లూరి విలేకరుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక మట్టి ప్రతిమలు మంగళవారం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం సంఘ అధ్యక్షులు కె వి సురేష్ కుమార్ మాట్లాడుతూ హిందువుల పండుగలలో మొట్టమొదటి పండుగ అయినటువంటి వినాయక చవితిని ప్రతి గ్రామంలో కూడా భక్తిశ్రద్ధలతో నిర్వహించాలన్నారు.


హిందు సాంప్రదాయం ప్రకారంగా ఏ దేవుని కొలిసే ముందైనా మొట్టమొదట వినాయక పూజతో ప్రారంభించడం సాంప్రదాయమని అన్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు ఇలా ఈ వినాయక పండుగను నిర్వహించే సమయంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆయన కోరారు.

ముఖ్యంగా వినాయకుని నిమజ్జనం సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో అల్లూరి విలేకరుల సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి కొర్రా కృష్ణ రావు, గౌరవ అధ్యక్షులు బడిగంటి శ్రీనివాసరావు,బి,డేవిడ్ రాజ్, పోతురాస వెంకట రాజ్, గుజ్జెలి నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కీల్లో నాగేశ్వరరావు,ప్రేమ్ కుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ కార్యదర్శి గబ్బాడ సింహాచలం, వంచర్బా మత్య్సలింగం, సిద్ధనాతి కొండలరావు, ఉప్పల,వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.