Breaking News

కొయ్యూరు: డి ఆర్ డిపో వద్ద నిరసన తెలిపిన టిడిపి నేతలు.

0 17

 కొయ్యూరు: డి ఆర్ డిపో వద్ద నిరసన తెలిపిన టిడిపి నేతలు.


అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం, కొయ్యూరు మండలం:


రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు కొయ్యూరు మండలం మర్రివాడ పంచాయతీ దొడ్డవరం గ్రామంలో డిఆర్ డిపో వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.


గతంలో డిఆర్ డిపోలో ఇచ్చినటువంటి బియ్యంతో పాటు నిత్యవసర వస్తువులు నూనె, పంచదార, కందిపప్పు, శనగలు, ఉల్లిపాయలు, సబ్బులు, అగ్గిపెట్టెలు ఇలా ప్రతి వస్తువు గతంలో లాగే ఇవ్వాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు.


ఇన్ని నిత్యవసర వస్తువులు ఇచ్చే డి ఆర్ డిపోలో వైసీపీ గవర్నమెంట్ బియ్యం ఒకటే ఇచ్చి పేద ప్రజలకు ఏదో వెలగబెడుతున్నామంటూ

చెప్పుకుంటున్న చేతకాని గవర్నమెంట్ పేదలకు గతంలో లాగే సబ్సిడీలో నిత్యవసర వస్తువులు ఇవ్వాలని టిడిపి కొయ్యూరు మండల పార్టీ అధ్యక్షులు

గొలిసింగి సత్యనారాయణ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు అన్నారు.


ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు వై.వరహాల బాబు,కొట్టేడి భాస్కర్ రావు (బాచి),వాసం రాంబాబు,కొర్రు పుల్లయ్య,కాకూరు బాలయ్య,పొట్టుకూరి సన్యాసిరావు,చేవల ప్రసాద్,కంకుపాటి బాబురావు,కోర్రు బాబురావు,గేదెలు భాస్కర్,సాంబే లక్ష్మయ్య,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.