Breaking News

పేదలకు శాపంగా మారిన ప్రభుత్వం మాకొద్దు… పోవాలి జగన్… రావాలి చంద్రన్న- మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.

0 16

 పేదలకు శాపంగా మారిన ప్రభుత్వం మాకొద్దు… పోవాలి జగన్… రావాలి చంద్రన్న.


ఉచిత రేషన్ ఎగ్గొట్టారు….. పేదల కడుపుకొట్టారు….


రూ.7 వేల కోట్ల రేషన్ బియ్యం బొక్కేసిన జగన్రెడ్డి గ్యాంగ్


-పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిఅల్లూరి జిల్లా పాడేరు న్యూస్:

చంద్రన్న పాలనలో రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులు 1.47 కోట్లు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తింపబడిన 89 లక్షల కార్డులకు ఇచ్చే సబ్సిడీ మాత్రమే కేంద్రం భరించేదని,అయినా చంద్రబాబు రాష్ట్ర నిధులు వెచ్చించి 1.17 కోట్ల కార్డులకు రేషన్ సరఫరా చేశారని పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గురువారం పాడేరు నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో జిమాడుగుల, పాడేరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులతో కలిసి పట్టణంలో ఉన్న సుండ్రుపుట్టు డిఆర్ డిపో వద్ద నిరసన వ్యక్తం తెలియజేస్తూ అనంతరం పాడేరు మండల తాహసశీల్దార్ వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.


అనంతరం ఆమె మాట్లాడుతూ

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డులు కోత పెట్టి 1.44 కోట్లకు కుదించారని,ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పి ఎం జి కె ఎ వై) కింద 89లక్షల మందికి -మాత్రమే ఉచిత బియ్యం ఇస్తూ 55 లక్షల కార్డు దారులకు ఎగనామం పెట్టారన్నారు.అదే సమయంలో కేంద్రం ఇచ్చిన రేషన్ బియ్యంలో రూ.2 వేల కోట్ల విలువైన 5.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం జగన్ రెడ్డి పేదలకు పంచకుండా పక్కదారి పట్టించారని పార్లమెంటులో కేంద్రమంత్రి ప్రకటించారన్నారు.2018 – 19లో టీడీపీ పాలనలో ఏపీ నుండి విదేశాలకు బియ్యం ఎగుమతులు 18లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, 2020-21 లో జగన్ రెడ్డి పాలనలో ఒక్క ఏడాదే 31.51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేశారని,టీడీపీ హయాంలో కంటే పంటల దిగుబడులు తగ్గాయని,చెబుతూనే 13.50 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ బియ్యం ఎగుమతి ఎలా చేశారని ప్రశ్నించారు.పేదలకు బియ్యం ఇవ్వకుండా కిలోకు రూ.5-7 ఇచ్చి బియ్యం పంపిణీ వాహన నిర్వాహకులు వాలంటీర్లు బియ్యాన్ని రీ సైక్లింగ్ పంపిస్తున్నారని,మూడేళ్లలో అలా పంపిన బియ్యం విలువ రూ.4,700 కోట్లు, కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని పక్కదారి పట్టించిన రూ.2 వేల కోట్ల విలువైన బియ్యం, అడ్డగోలుగా బొక్కేసిన రూ. 1700 కోట్ల విలువైన బియ్యం మొత్తంగా రూ.7 వేల కోట్ల విలువైన బియ్యం విదేశాలకు తరలించి పేదల కడుపు కొట్టారన్నారు.రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి వాటిని కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, ముంబై పోర్టులకు తరలించి.. అక్కడి నుండి శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్ సహా పలు ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నారన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీకోస్ట్, బెనిన్, సెనెగల్, టోజ్లో వంటి దేశాలకు కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే (జగన్ రెడ్డి బినామి) ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని తండ్రి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ ద్వారంపూడి భాస్కర రెడ్డి ప్రోద్బలంతో బియ్యం ఎగుమతి చేస్తున్నారన్నారు.రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి బోర్ర విజయరాణి, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బాడ సింహాచలం, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి గంగపుజారి శివకుమార్, అరకు పార్లమెంట్ మహిళ అధికార ప్రతినిధి అల్లంగి సుబ్బలక్ష్మి, పాడేరు మండల అధ్యక్షులు కూడి రామనాయుడు, జిమాడుగుల మండల అధ్యక్షులు వంతల కొండలరావు, ఐ టి డి పి ఇన్చార్జ్ బుద్ధ జ్యోతి కిరణ్ ,కొట్టగుల్లి సుబ్బారావు,కిముడు కళ్యాణం, రీమలి,కొండబాబు,కె. రమేష్ నాయుడు, బుక్క జగదీష్, వి. నీలకంఠం, కొయ్యూరు మాజీ మండల అధ్యక్షులు రామ్మూర్తి, శ్రీను, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.