Breaking News

రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసిన రాష్ట్ర SC,ST కమీషన్ మాజీ సభ్యులు,టీడీపీ నియోజకవర్గ నేత సివేరి అబ్రహం.

0 14

 రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసిన రాష్ట్ర SC,ST కమీషన్ మాజీ సభ్యులు,టీడీపీ నియోజకవర్గ నేత సివేరి అబ్రహం.


టీడీపీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండల కేంద్రంలో గురువారం ఉదయం సివేరి అబ్రహం ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేసి నాలుగు రోడ్లు జంక్షన్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి MRO గార్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా *సివేరి అబ్రహం* మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టానికి తూట్లు పొడుస్తున్నదని అన్నారు.PMGKAY పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ బియ్యంతో పాటు , ఉచిత బియ్యాన్ని వెంటనే తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదవాడికి అందించాలని అబ్రహం కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపిపి అమ్మన్న,వైస్ సర్పంచ్ నిర్మల,మాడగడ ఎంపిటిసి కృష్ణ,టీడీపీ సీనియర్ నేత రెహమాన్,దివంగత నేత అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ తనయుడు సివేరి సురేష్, అరకు పార్లమెంట్ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి సొమెలి బాలు,తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిరాం,మహిళ నేతలు కళ,ద్రౌపది,తెలుగు యువత రాంబాబు, కడి,డేవిడ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.