పాత పద్ధతి వలె డి ఆర్ డిపోల వద్ద బియ్యం,నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని, జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు గురువారం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సుండ్రుపుట్టులో ఉన్న డి ఆర్ డిపో వద్ద టిడిపి నేతలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.
అనంతరం పాడేరు మండల తహసిల్దార్ కి వినతి పత్రం సమర్పించారు.
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ నూతన విధానం వల్ల సామాన్య ప్రజలు సైతం రేషన్ సరుకులు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.
కనుక డిఆర్ డిపోల్లో పాత పద్ధతి వలె బియ్యం, నిత్యావసర వస్తువులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.