పారిశుద్ధ నిర్వహణపై టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయండి
ఫిర్యాదు అందిన వెంటనే 24 గంటల్లో సమస్య పరిష్కారము.
ప్రతిరోజు పారిశుధ్యం పై వచ్చిన ఫిర్యాదులను మేయర్ స్వయంగా పర్యవేక్షణ.
నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి.
విశాఖపట్నం: పారిశుద్ధ్య నిర్వహణపై టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదులు చేయాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ 0891- 2869129 నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ఫిర్యాదులు చేయుటకు కేటాయించడం జరిగిందని, ప్రజలు స్పందించి ఈ నెంబర్ కు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేకంగా పారిశుద్ధ్య నిర్వహణపై మాత్రమే ఫిర్యాదులు చేయాలని, ఫిర్యాదు చేసిన 24 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుందని అలాగే ప్రతిరోజు పారిశుద్ధ్యం పై వచ్చిన ఫిర్యాదులను స్వయంగా ఆమె పర్యవేక్షిస్తానని తెలిపారు. ఫిర్యాదును దారుడుతో నేరుగా ఆమె మాట్లాడి వారిచ్చిన ఫిర్యాదును పరిష్కారం అయ్యిందా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకుంటానని తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ తమ మొబైల్లో ఈ ఫిర్యాదు నెంబర్ ను ఫీడ్ చేసుకోవాలని తెలిపారు.
జీవీఎంసీ పారిశుద్ధ విభాగపు అధికారులు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే స్పందించి, ఆయా సమస్యలను నిర్ణీత సమయానికే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించినా సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకొని పడతాయని ఆమె ఒక ప్రకటన ద్వారా హెచ్చరించారు.