Breaking News

మహానేత వైయస్సార్ కు గూడెంకొత్త వీధి వైసీపీ మండల నాయకులు ఘన నివాళులు.

0 17

 

మహానేత వైయస్సార్ కు గూడెంకొత్త వీధి వైసీపీ మండల నాయకులు ఘన నివాళులు. 

అల్లూరి సీతారామరాజు జిల్లా,జికె వీధి మండలం:

దివంగత మహానేత వైఎస్సార్‌ భౌతికంగా లేకపోయిన ప్రజల గుండెల్లో కొలివై ఉన్నారని మండల ఎంపీపీ బోయిన కుమారి, మండల అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్ పేర్కొన్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 13 వ వర్ధంతి సందర్భంగా గూడెం కొత్త వీధి మండల ప్రధాన రహదారిలో ఉన్న ఆయన విగ్రహానికి సర్పంచ్ కుర్ర సుభద్ర, ఎంపీటీసీలు పసుపులేటి నాగమణి, లోవలక్ష్మి, రాజేశ్వరి, చైర్మన్ వసుపరి ప్రసాద్ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 ఈ సందర్భంగా గూడెం కొత్తవీధి మండల అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్ మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు.

 ఆ మహానేత తన జీవితాన్ని ప్రజల సంక్షేమానికి అంకితం చేశారన్నారు.

 ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, 104 ఆరోగ్య సేవల నుంచి ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తి పొందాయని, అలాగే పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు.. అభివృద్ధి కార్యక్రమాలు, యువతకి ఉపాధి అవకాశాలు పరిశ్రమల స్థాపన దేశానికి వెన్నుముక రైతే అని నమ్మి అన్నదాతల కొరకు పలు సాగునీటి ప్రాజెక్టులను కట్టించిన మహానేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఘనతే అన్నారు.

Leave A Reply

Your email address will not be published.