Breaking News

బదిలీ పై వెళ్ళిన పంచాయితీ కార్యదర్శి హైమావతి కి చిరు సన్మానం.

0 15

 బదిలీ పై వెళ్ళిన పంచాయితీ కార్యదర్శి కి చిరు సన్మానం.


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని రావణా పల్లి పంచాయితీలో పంచాయితీ కార్యదర్శి జి.హైమావతి విధులు నిర్వహించి, పంచాయితీ ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా, బదిలీ పై మరొక చోటికి వెళ్ళేంత వరకు ఎటువంటి రిమార్క్ లేకుండా తన సేవలను పంచాయితీ ప్రజలకు అందించారు.

ఈ నేపథ్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా బదిలీపై వెళ్లిన పంచాయితీ కార్యదర్శి హైమావతి ని,నూతన పంచాయితీ కార్యదర్శి రజినీ ని రావణా పల్లి పంచాయితీ లోని రేవడవీధి గ్రామస్తులు ఈరోజు ఆహ్వానించి కోలాటాలతో స్వాగతం పలికారు.

అనంతరం రేవడవీధి గ్రామస్తులు హైమావతి కి శాలువా తో చిరు సన్మానం చేశారు.

అలాగే వీరితో పాటు పంచాయితీ కార్యదర్శి రజినీ, సచివాలయ సిబ్బంది ఆమెకు శాలువాతో సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.