Breaking News

సకాలంలో విధులకు హాజరు కాని సచివాలయ సిబ్బందిపై చర్యలు తప్పవు- పాడేరు డివిజనల్ పంచాయతీ అధికారి ఆదేశం.

0 13

 సకాలంలో విధులకు హాజరు కాని సచివాలయ సిబ్బందిపై చర్యలు తప్పవు- పాడేరు డివిజనల్ పంచాయతీ అధికారి ఆదేశం.


అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో ఉన్న అన్ని పంచాయతీల సచివాలయాలలో పనిచేసే ఉద్యోగులు తమ విధులకు సకాలంలో హాజరు కాని వారిపై తగిన చర్యలు తీసుకోవడం తప్పదని పాడేరు డివిజనల్ పంచాయతీ అధికారి పి.ఎస్ కుమార్ అన్నారు. కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీలో శనివారం డిఎల్పిఓ కుమార్ డౌనూరు, మూలపేట సర్పంచులు, సచివాలయ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు.

సచివాలయ కార్యాలయం సందర్శించి సిబ్బంది విధులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎల్పిఓ మాట్లాడుతూ ప్రతిరోజు సిబ్బంది తమ శాఖలపై స్పందన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. అప్పుడే ప్రజలకు జవాబుదారీ అవుతుందన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలిపారు. అలాగే మధ్యాహ్నం సిబ్బంది అందరూ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. శివారు గ్రామాల్లో విధిగా పర్యటించి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.పగటి పూట వీధి దీపాలు వెలిగితే కార్యదర్శులపై చర్యలు తప్పవని డిఎల్పిఓ హెచ్చరించారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు సరఫరా సక్రమంగా చేపడితే వ్యాధులు ప్రబలే అవకాశం తగ్గుతుందని సూచించారు. మూలపేటలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి వినియోగంలోకి తేవాలని కార్యదర్శి మరియు ఈవోఆర్డి పైడింనాయుడుకు ఆదేశించారు. ఈ సమావేశానికి హాజరైన సర్పంచులు పంచాయతీల్లో కనీస నిధులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, ప్రజలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో డిఎల్పిఓ గా తమ ఇబ్బంది గుర్తించి తక్షణమే 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేయాలని సర్పంచులు కోరారు. ఈ కార్యక్రమంలో డౌనూరు,మూలపేట సర్పంచులు భవాని, వెంకటలక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.