Breaking News

కొయ్యూరు:చింతాలమ్మ ఘాటీ వద్ద ట్రాక్టర్ బోల్తా.

0 19

 

చింతాలమ్మ ఘాటీ వద్ద ట్రాక్టర్ బోల్తా.

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం లోని చింతాలమ్మ ఘాటీ వద్ద, కేడీపేట నుండి ఇటుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బ్రేకులు ఫెయిల్ అయి బోల్తా పడింది. కొయ్యూరు మండల విశాలాంధ్ర రిపోర్టర్, రాజేంద్రపాలెం పిహెచ్సి డాక్టర్ సంపత్ కుమార్, మరియు మరి కొంతమంది స్థానికుల సహాయంతో బోల్తా కొట్టిన ట్రాక్టర్ లోపలి వైపు సీటు వద్ద ఇరుక్కుపోయిన ఒక స్త్రీని చాకచక్యంగా బయటకు తీశారు.పెద్దగా ప్రమాదం జరగలేదు. స్వల్ప గాయాలతో బయట పడ్డారు. గాయపడిన వారిని రాజేంద్రపాలెం పిహెచ్సి వైద్యాధికారి సంపత్ కుమార్ ఇద్దరిని తన కారులో రాజేంద్రపాలెం పిహెచ్సికి తీసుకువెళ్లగా, మరొక ఇద్దరిని అంబులెన్స్ లో ఎక్కించి హాస్పిటల్ కి పంపించారు.

Leave A Reply

Your email address will not be published.