కొయ్యూరు ఎస్ఐ రాజారావు ఆధ్వర్యంలో నాటుసారా బట్టీలపై దాడులు.
ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గ్రామ శివారులో ఉన్న నాటు సారా స్థావరాలపై కొయ్యూరు ఎస్సై రాజారావు ఆధ్వర్యంలో తమ సిబ్బందితో మరియు మహిళా పోలీసులతో దాడులు నిర్వహించి 15 వందల లీటర్ల నాటుసారా పులుపును, తయారీ సామగ్రిని ధ్వంసం చేయడం జరిగింది. ఎవరైనా నాటుసారా తయారీ క్రయ విక్రయాలకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజారావు తెలిపారు.