Breaking News

కొయ్యూరు: ముగ్గురికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు.

0 14

 కొయ్యూరు: ముగ్గురికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు.

ఎస్.భరత్ కుమార్ 

ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలంలోని బాయ్స్-2 బాలుర ఆశ్రమ పాఠశాలలో పీడి గా విధులు నిర్వహిస్తున్న అంబటి నూకరాజు, రత్నంపేట ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న శ్యామల భరత్ కుమార్, కొమ్మిక బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్ ఎం గా విధులు నిర్వహిస్తున్న ఎస్.సంధ్య…

ఎ.నూకరాజు

ఈ ముగ్గురికి పాడేరు లోని ఐటీడీఏ మీటింగ్ హాల్ వద్ద జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐ టి డి ఏ పి ఓ రోణంకి గోపాలకృష్ణ చేతుల మీదుగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు అందుకున్నారు.

ఎస్.సంధ్య

ముందు ముందు ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని వీరి శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ అవార్డు సన్మాన కార్యక్రమంలో డిడి కొండలరావు, డీఈవో రమేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.