Breaking News

విశాఖ: KGH లో గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ మైథిలి ని కోరిన రాష్ట్ర SC,ST కమీషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం.

0 13

 విశాఖ: KGH లో గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ మైథిలి ని కోరిన రాష్ట్ర SC,ST కమీషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం.


సోమవారం ఉదయం విశాఖ KGH లో ఆమెతో అబ్రహం సమావేశమయ్యారు.ఈ సంధర్భంగా అబ్రహం మాట్లాడుతూ ఎస్టీ సెల్ ద్వారా గిరిజనులకు అండగా ఉండి వారికి మెరుగైన వైద్యం అందించాలని,చికిత్స చేసుకొనేందుకు వచ్చిన గిరిజనులకు హాస్పిటల్ లో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉందో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారని,


వారికి సిబ్బంది సరైన సమాచారం అందించి గిరిజనుల వైద్యానికి సహాయపడాలని అబ్రహం కోరారు. అనంతరం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గిరిజనులను పరమర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నేత రెహమాన్, దివంగత నేత మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ తనయుడు సివేరి సురేష్,తెలుగు యువత ధయానిధి, ఆనంద్,మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.