గ్రామ సచివాలయ వ్యవస్థతో మెరుగైన పాలన
– పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి.
అల్లూరి సీతారామరాజు జిల్లా,జికె.వీధి మండలం:
గ్రామ సచివాలయ వ్యవస్థ రావడంతో ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని దానికి ఓ శాసన సభ్యురాలుగా ఎంతో గర్వపడుతున్నానని పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.
G.K వీధి మండలం దేవరపల్లి గ్రామ సచివాలయాన్ని పాడేరు శాసన సభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మంగళవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన పాలనకు తెర తీశారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ తలుపుతట్టి మరి ఇవ్వాలనే ఉద్దేశంతోనూ, పాలన ప్రజలకు మరింత చేరువు చేయాలన్న లక్ష్యంతోనూ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని ఆమె పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ వలన ప్రజలు అధికారులతో సమన్వయం కావడానికి మరింత అవకాశం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ తమర్భ నరసింగరావు,సర్పంచ్ S. బుజ్జి బాబు, ఎంపీటీసీ కృష్ణ మూర్తి, ఎంపీపీ బోయిన కూమరి, మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్, వైస్ ఎంపీపీ సప్పగెడ్డ ఆనంద్, ZPTC కిముడు శివరత్నం,
ఎంపీటీసీలు,P. నాగమణి,రాజులమ్మ,M సత్యనారాయణ, సర్పంచ్‌లు, V. కాసులమ్మ,K. వీరేంద్ర ప్రసాద్, వంశీ కృష్ణ,A. లోవకూమరి,D. నాగులమ్మ, V. నాగరాజు, Ex: ZPTC లు మామిడి చందర్ రావు, మచ్చల మత్యారాజు,PCC చైర్మన్ ప్రసాద్,
పాడి నూకరాజు, చింతపల్లి ZPTC పోతురాజు బాలయ్య పడాల్, చింతపల్లి మండల అధ్యక్షుడు మోరి రవి, చింతపల్లి సర్పంచ్ & పోరం అధ్యక్షులు దురియా పుష్పలత, తాజంగి ఎంపిటిసి అనూష, మైనారిటీ అధ్యక్షులు పెద నాగూర్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు నాగుర్ బాబు, కార్యకర్తలు రాజేష్,నారాయణ రావు, చంటి,T లోవరాజు, మంగ, బాలకృష్ణ, గిరి,v. రాజు, రామారావు, అంజి, లక్ష్మణ్, అధికారులు వాలంటీర్లు పాల్గొన్నారు.