Breaking News

కొయ్యూరు CAH స్కూల్ స్థలాన్ని కాపాడండి – గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్.

0 13

 కొయ్యూరు CAH స్కూల్ స్థలాన్ని కాపాడండి – గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్.


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:

కొయ్యూరు సి ఏ హెచ్ పాఠశాల స్థలాన్ని ఆక్రమించి చర్చి నిర్మాణం జరుగుతుందని,ఐటీడీఏ అధికారులు చొరవ తీసుకొని తక్షణమే చర్చి నిర్మాణం నిలుపుదల చేసి ఆక్రమణలను తొలగించాలని గిరిజన విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే స్థలంలో గతంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరి కొంతమది ఫిర్యాదు చేయగా, ఆక్రమనకు గురైన స్థలం వద్ద నిషేధ ఆజ్ఞలతో ప్రభుత్వం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ బోర్డును తొలగించి పాఠశాలకు చెందిన స్థలాన్ని ఆక్రమించి చర్చి నిర్మాణం పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు భూమి లేకుండా పోతుందని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు వాపోయారు. కొయ్యూరు సిఏహెచ్ స్కూల్ పాఠశాల స్థలాన్ని ఆక్రమణకు గురిచేసి చర్చి నిర్మాణం చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుని అక్రమంగా నిర్మిస్తున్న చర్చిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. GSU జిల్లా అధ్యక్షులు బూడిదే సుమన్, కిరసాని కిషోర్,బి.మాధవ రావు,కె.ప్రభాకర్,వి.నానిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.