Breaking News

కొయ్యూరు మండలంలో రేపు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పర్యటన.

0 19

 కొయ్యూరు మండలంలో రేపు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పర్యటన.


అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం, కొయ్యూరు మండలంలో రేపు ఆదివారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పాడేరు ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో రాజేంద్ర పాలెం గ్రామంలో ఉదయం 10:00 గంటలకు  అన్న క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుందని టిడిపి పార్టీ మండల నాయకులు తెలిపారు. 

తరువాత మండలంలోని బూధరాళ్ల, రేవళ్లు పంచాయితీల్లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ఈ యొక్క కార్యక్రమానికి కొయ్యూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు హాజరు కావాలని కొయ్యూరు మండల పార్టీ అధ్యక్షుడు గొలిసింగి సత్యనారాయణ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు,రాష్ట్ర ST సెల్ కార్యదర్శి కొర్రు రామమూర్తి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.