Breaking News

కొయ్యూరు: అన్న క్యాంటీన్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..

0 36

 వైసీపీ పాలనలో గిరిజన ప్రాంతం అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.

వైసిపి రాక్షస పాలనకు గుణపాఠం తప్పదు.

-మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.


కొయ్యూరులో అన్న క్యాంటీన్ ప్రారంభం.

అల్లూరి జిల్లా కొయ్యురు మండలం:

రాక్షస పాలన సాగుతున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆదివారం కొయ్యురులో టీడీపీ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ఆమె ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక్క అవకాశం ఇవ్వలంటూ అధికారం లోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి.. మూడేళ్ల పాలనలో ప్రజలకు నరకం చూపించారని, ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు ఇలా పలు వర్గాల ప్రజలు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లో సీపీఎస్ ను రద్దుచేస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి.. తీరా గద్దెనెక్కిన తరువాత మాటతప్పి, మడమ తిప్పేసి పాత పింఛన్ అమలు సాధ్యంకాదని అంటున్నారని ధ్వజమెత్తారు.

గిరిజన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దుచేసి, జీవో నంబరు3 రద్దుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో నేటికీ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయలేకపోతుందని,గిరిజన ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు విప్పడంలేదని విమర్శించారు. వైసీపీ పాలనలో గిరిజన ప్రాంతం అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు.

టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు మినహా కొత్తగా చేపట్టిన పనులు ఒక్కటి కూడా కనిపించడం లేదన్నారు. యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంతో 33 గ్రామాల గిరిజనులను నిర్వాసితులను చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆమె ఆరోపించారు. పేదల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. పేదల కడుపు నింపే బాధ్యతను టీడీపీ తీసుకుంటే వైసీపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.