Breaking News

కెజిబివి కళాశాలల్లో పూర్తి స్థాయిలో అధ్యాపకులను నియమించకపోవడం బాధాకరం- తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అరకు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి వనుగు త్రినాధ్.

0 28

 కెజిబివి కళాశాలల్లో పూర్తి స్థాయిలో అధ్యాపకులను నియమించకపోవడం బాధాకరం- తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అరకు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి వనుగు త్రినాధ్.

వనుగు త్రినాథ్ 

అల్లూరి జిల్లాలో కొన్ని కె.జి.బి.వి కళాశాలలలో అధ్యాపకులు లేని దుస్థితి ఉందని,సోమవారం తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అరకు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి వనుగు త్రినాధ్ అన్నారు.ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఉన్న కె.జి.బి.వి కళాశాలలలో విద్యను బోధించే అధ్యాపకులు లేని కొన్ని కళాశాలలు ఉన్నాయన్నారు. అటువంటి కళాశాలలలో అధ్యాపకులను నియమించాల్చిన ప్రభుత్వమే నిర్లక్ష్యం వహించడం ఏంటి అని ప్రశ్నించారు.గిరిజన ప్రాంతంలో విద్యను అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకునే గిరిజన ఎమ్మెల్యేలు,ఎంపీ కె.జి.బి.వి కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైపల్యం చెందారన్నారు.గతంలో ప్రతి పాఠశాల,కళాశాలలో హెల్త్ వర్కర్ ఉండేవారని, వాళ్ళను కూడా రోడ్డున పడేసి విద్యార్థుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలు ఆడుతుంది అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జి.మాడుగుల తాజంగి కే.జీ.బీ.వీ విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారని, అయినా వాళ్ళ కుటుంబాలను ఆదుకున్న దాఖలాలు లేవు అన్నారు. గిరిజన ప్రాంతంలో ఉన్న పాఠశాల, కళాశాలలలో మెనూ సక్రమంగా అమలు చేయటం లేదు కనుకనే విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. ఎప్పటికైనా విద్యాధికారులు గిరిజన ఎమ్మెల్యేలు,ఎంపీ దృష్టి పెట్టకపోతే విద్యార్థులు,విద్యార్థి సంఘాలు మరింత ఉద్యమాలు చేస్తాయని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.