Breaking News

జికె.వీధి:పెదవలస పీహెచ్సీ కి నూతన అంబులెన్స్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరిన వైస్ ఎంపీపీ సప్పగడ్డ ఆనందరావు

0 23

 అల్లూరి సీతారామరాజు జిల్లా,జికే.వీధి మండలం,పెదవలస లో ఉన్న పీహెచ్ సీ లో సరైన అంబులెన్స్ లేక పీహెచ్సీ పరిధిలో ఉన్న పంచాయతీల ప్రజలు అనారోగ్య బారిన పడితే తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని జీకే వీధి వైస్ ఎంపీపీ సప్పగడ్డ ఆనందరావు తెలిపారు.


గతంలో నూతన అంబులెన్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలియజేసినప్పటికీ రిపేర్ అయిన పాత అంబులెన్స్ ని ఈ పీహెచ్సీకి ఏర్పాటు చేశారని, అది తరచూ మొరాయిస్తుందని అన్నారు. కనుక ప్రస్తుత సీజనల్ వ్యాధుల దృష్ట్యా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కొత్త అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వైస్ ఎంపీపీ ఆనందరావు,పెదవలస సర్పంచ్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.