Breaking News

అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వైసీపీ నేతలు.

0 22

 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వైసీపీ నేతలు.


ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం,కొయ్యూరు మండలం,వెలగల పాలెం గ్రామపంచాయతీ,కితాబు గ్రామంలో అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి ప్రత్యేక చొరవతో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి గదుల నిర్మాణానికి, శరభన్నపాలెం ఎంపిటిసి లోకుల సోమగాంధీ,వెలగల పాలెం సర్పంచ్ ఇరవాడ రత్నకుమారి శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి భర్త గారైన నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ పాల్గొన్నారు.

గతంలో ఈ ప్రాంతంలో అరకు ఎంపీ పర్యటించి కిత్తాబు గ్రామంలో పాఠశాల అదనపు తరగతి గది నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని నేటితో ఆ హామీ సఫలీకృతం అయిందని అక్కడ ఉన్న ప్రజలకు వైసీపీ శ్రేణులు తెలిపారు.

 నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శివప్రసాద్,సర్పంచ్,ఎంపీటీసీ లతో ఆ గ్రామాన్ని సందర్శించి శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి ద్వారానే తెలుసుకొని ఎంపీ కి వివరించి వారితో చర్చించి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.