Breaking News

కొయ్యూరు:కంపరేగుల నుండి శరభన్నపాలెం వెళ్ళే రహదారి వద్ద వంతెన నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరుతున్న సర్పంచ్.

0 19

 కొయ్యూరు:కంపరేగుల నుండి శరభన్నపాలెం వెళ్ళే రహదారి వద్ద వంతెన నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరుతున్న సర్పంచ్.


గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం లోని శరభన్న పాలెం,కంపరేగుల, బట్టిమెట్ట,గాంకొండ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

వర్షాలు కురిసి కొండ వాగు పొంగిన ప్రతిసారీ మూడు నుంచి ఏడు ఎనిమిది రోజులు బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు ఉండటం లేదని స్థానికులు తెలిపారు. నిత్యావసర సరుకులు తెచ్చుకోవడం కూడ కష్టంగా ఉంటుందని, కొన్ని సార్లు ప్రాణాలకు తెగించి ఏరు దాటడం, ఈ గ్రామాల ప్రజలకు కష్టంగా మారుతుందని అన్నారు.కొన్ని సార్లు అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలకు బాగోలేని వ్యక్తులను హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం కూడ కష్టమవుతుందని అన్నారు.

ఏళ్ల తరబడి ఈ మూడు గ్రామాల ప్రజలు బిడ్జ్ కోసం అనేకసార్లు అనేకమంది నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేదని సర్పంచ్ వెంకటలక్ష్మి వాపోయారు.

అనేక మార్లు ఎంపీ,ఎమ్మెల్యే లకు ధరఖాస్తు చేసిన నాటి నుంచి నేటి వరకు చేస్తున్నాం,చూస్తున్నాం అంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో చేసేది అయితే ఏమీ లేదని అన్నరు.

ప్రస్తుత పరిస్థతుల్లో మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు పంజా విసురుతున్న వేళ నన్ను గెలిపించుకున్న ప్రజలకు కనీసం పరామర్శించలేని దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా నాయకులు చొరవ చూపి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆమె కోరారు.

Leave A Reply

Your email address will not be published.