Breaking News

గిరిజనులను మోసం చేసిన సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ ను తక్షణమే అరెస్టు చేయాలి- దొండా ప్రసాద్.

0 20

 గిరిజనులను మోసం చేసిన సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ ను తక్షణమే అరెస్టు చేయాలి- దొండా ప్రసాద్.


అల్లూరి జిల్లా పాడేరు కు చెందిన గిరిజన నిరుద్యోగులకు ఆరోగ్య శాఖలో నకిలీ ఉత్తర్వులు ఇచ్చి గిరిజనులను మోసం చేసిన ఆ శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ ను తక్షణమే అరెస్టు చేసి దీని వెనుక ఉన్న సూత్రధారులపై తగిన చర్యలు చేపట్టాలని గిరిజన సంఘం నాయకులు దొండా ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నకిలీ ఉత్తర్వులు ఇచ్చి లక్షలు కాజేసిన విషయమై పాడేరు పోలీస్ స్టేషన్లో సిహెచ్.చంద్రశేఖర్ పై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, కానీ ఇంతవరకు ఏ విధమైన చర్యలు చేపట్టలేదు అన్నారు. చంద్రశేఖర్ ను అరెస్టు చేస్తే దీని వెనుక ఉన్న వారందరూ బయటకు వస్తారన్నారు. ఈ అక్రమాల్లో ఏజెన్సీలో ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కీలక అధికారి హస్తం ఉన్నట్లుగా ప్రచారం సాగుతుందన్నారు. అధికార పార్టీ అండదండలు పూర్తిగా ఉండటం వలన ఆరోగ్య శాఖలో ఇతనే సర్వాధికారి. ఇతని కనుసన్నల్లోనే జరగాలని లేకుంటే ఏజెన్సీలో ఉద్యోగాలు చేయలేమని కొంతమంది ఆరోగ్య శాఖ ఉద్యోగులు అన్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు. పాడేరు జిల్లా ఆరోగ్యశాఖలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ అవినీతిపై విచారణ అధికారిగా ఎస్ ఎఫ్ రవీంద్రను వేసారని ప్రకటన చేశారని, కానీ విచారణ అధికారిగా నేటికీ రవీంద్రకు ఉత్తర్వులు ఇవ్వలేదు అన్నారు. జిల్లా ఉన్నతాధికారులకు సైతం గిరిజనుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు.

Leave A Reply

Your email address will not be published.