Breaking News

జికె.వీధి:సిగినాపల్లి రామ్ నగర్ కాలనీ సమస్యలు సబ్ కలెక్టర్ దృష్టికి.

0 20

 

అల్లూరిసీతారామరాజు జిల్లా సబ్ కలెక్టర్ అభిషేక్ జి.కె.వీధి మండలం, దామనపల్లి పంచాయితీ,సిగినపల్లి రామ్ నగర్ కాలనీ గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలతో మాట్లాడారు.ప్రజలు మాట్లాడుతూ.. మా SRN కాలనీ గ్రామం నుంచి అల్లూరి సీతారామరాజుతో స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న సంకోజీ.ముక్కుడు(మూగయ్య) జన్మించిన ఈ మా గ్రామం పేరు ప్రభుత్వం దృష్టిలో లేదు అందుకే అభివృద్ధిలో వెనుకబడిందని గ్రామస్తులు ఆవేదన చెందారు. తమ సమస్యలను వివరించగా సబ్ కలెక్టర్ అభిషేక్ తప్పకుండా అభివృద్ధి జరిగేలా చూస్తానని గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను సంబంధింత శాఖల అధికారులతో మాట్లాడి తెలుకొని అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.