కేంద్ర కాఫీ బోర్డు సభ్యురాలు మాధవికి వెల్లువెత్తుతున్న అభినందనలు.
కొయ్యూరు: కేంద్ర కాఫీ బోర్డు సభ్యురాలుగా మరోమారు నియమితులైన అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీ గొడ్డేటి మాధవికి కేంద్ర ప్రభుత్వం కీలక పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాఫీ బోర్డును పునర్ నియమిస్తూ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవికి మరోమారు అవకాశం కల్పిస్తూ కేంద్ర కాపీ బోర్డు సభ్యురాలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నేతలు మాధవికి అభినందనలు తెలియజేసారు.