Breaking News

ఎన్నికలు సమీపిస్తుడడంతో కళ్యాణమిత్ర పథకం గుర్తుకువచ్చిందా?-తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్.

0 25

 కళ్యాణ మిత్రలను మోసం చేస్తారా…?


ఎన్నికలు సమీపిస్తుడడంతో కళ్యాణమిత్ర పథకం గుర్తుకువచ్చిందా?


వైసిపి ప్రభుత్వానికి ప్రజలు నమ్మరు


-తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్

అల్లూరి జిల్లా పాడేరు న్యూస్:


ఈ మూడేళ్లు వైసీపీ ప్రభుత్వంలో కళ్యాణ మిత్ర పథకాన్ని పక్కనపెట్టి ఎన్నికల ముందు ప్రజలకు మభ్య పెట్టాలని ఇప్పుడు అమలు చేస్తుందని, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో వారు మాట్లాడుతూ ఏడాది పాటు పని చేయించుకొని కళ్యాణమిత్రలకు జీతాలు ఎగ్గొడతారా..? 2019-20 సంవత్సరంలో పనిచేసిన 1800 మంది కళ్యాణమిత్రలకు ఇప్పటివరకూ జీతం ఎందుకు చెల్లించలేదో సమాధానం చెప్పాలన్నారు.కళ్యాణమిత్రలకు ప్రత్యామ్నాయం చూపకుండానే, కళ్యాణమస్తు, సాదీతోఫా బాధ్యతలను వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ మూడేళ్లు ఈ పథకాన్ని పక్కన పెట్టి, ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టాలనా ఇప్పుడు అమలు చేసేదని ధ్వజమెత్తారు.తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన ఈ పథకాలను రెండేళ్ల పాటు ఎందుకు అమలు చేయలేదో, ఎన్నికల్లో మీరిచ్చిన హామీలను ఎందుకు తుంగలో తొక్కారో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

ఈ రెండేళ్లలో వివాహం చేసుకున్నవాళ్లకు కూడా ఈ పథకం వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.