Breaking News

17న టిడిపి నియోజకవర్గస్థాయి సమావేశం.ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయండి. – నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.

0 20

 17న టిడిపి నియోజకవర్గస్థాయి సమావేశం -పాడేరులో అన్న క్యాంటీన్ ప్రారంభం.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గస్థాయి పరిశీలకులు హాజరు.

ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయండి.

– నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.


అల్లూరి జిల్లా,పాడేరు న్యూస్:

ఈనెల 17న శనివారం జరుగు నియోజకవర్గ స్థాయి సమావేశం పాడేరు మండలం కుమ్మరి పుట్టు గ్రామంలో జరుగుతుందని తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నియోజకవర్గ స్థాయి సమావేశానికి నియోజకవర్గం పరిశీలకులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, అదే రోజు పాడేరులో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది కావున నియోజకవర్గంలో ఉన్న క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ కమిటీలు, సేవా మిత్రలు, అనుసంధాన కమిటీలు, మండల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా నాయకులు, మండల స్థాయి నాయకులు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

Leave A Reply

Your email address will not be published.