Breaking News

శృంగవరపుకోట:స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు.

0 18

 శృంగవరపుకోట:స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు.


శృంగవరపుకోట స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్,వై ఆర్ సి,ఎన్ సి సి ఆధ్వర్యంలో అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం వారు సంయుక్తంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్.కేశవరావు అధ్యక్షతన కళాశాల ఎన్ ఎస్ ఎస్ పిఓ లు కుమారి బి.సంధ్యారాణి,షేక్ వలీ ఖాన్ ఆధ్వర్యంలో మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.


ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు,ఒకరికి ప్రాణదానం చేసే అవకాశం ఉందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ ఎస్ ఎస్ పిఓ లు ఎన్ ఎస్ ఎస్ కేర్ టేకర్ మాట్లాడుతూ రక్తదాన ఆవశ్యకతను ప్రాధాన్యతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, ఎన్ సి సి కేడెట్స్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎం.రమేష్ కుమార్, వాసుదేవరావు,డాక్టర్ సివిఎస్.రవీంద్రనాథ్, శ్రీలక్ష్మి,ఎన్ సి సి కేర్ టేకర్ భాస్కర్,జి ఈరన్న, కళాశాల అధ్యాపక బృందంతో పాటు విజయనగరం డాక్టర్ జి.వెంకట్, 
పి ఆర్ ఓ.రాము జిల్లా ప్రతినిధి డి.సూర్యారావు వి.సత్య రామ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.