Breaking News

కేంద్ర కాఫీ బోర్డు మెంబర్ గా రెండవసారి తనకు అవకాశం కల్పించిన సీఎం కి కృతజ్ఞతలు తెలిపిన అరకు ఎంపీ.

0 21

 

కేంద్ర కాఫీ బోర్డ్ మెంబర్ గా రెండవసారి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన అరకు ఎంపీ.

అల్లూరి సీతారామరాజు జిల్లా,

కొయ్యూరు మండలంలోని తమ స్వగ్రామం శరభన్నపాలెంలో ఎంపీ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాఫీ బోర్డ్ మెంబర్ గా రెండవసారి తనకు అవకాశం కల్పించినందుకు గాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసారు.ఎంతో మంది తమ పార్టీలో ఉన్నా ఏజెన్సీ ప్రాంత గిరిజన బిడ్డ అయిన ఎంపీ గా ఉన్న తనను గుర్తించి ఈ అవకాశం కల్పించటం చాలా ఆనందంగా ఉందని అన్నారు.ఈ సందర్భంగా కాఫీ సాగు గురించి, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో సెల్ టవర్ ల నిర్మాణం, పసుపు సాగు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు, మరమ్మత్తులకు గురైన రహదార్లు, మంచినీటి సౌకర్యం, ఆశ్రమ పాఠశాలలో నాడు నేడు గురించి, వంతెన సమస్యలు వాటి పరిష్కారం, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పీహెచ్ సీ లలో ఉన్న సమస్యలు గురించి ఎంపీ మాట్లాడారు.

Leave A Reply

Your email address will not be published.