అకాల వర్షానికి పూరి గుడిసె కూలి రోదిస్తున్నా మహిళకు మానవత్వం చాటుకున్న జీకే వీధి పత్రిక మిత్రులబృందం.
అల్లూరి సీతారామరాజు జిల్లా,గూడెం కొత్త వీధి మండలం, ఆర్ వి నగర్, బూడిద పాకలు గ్గ్రామానికి చెందిన గొల్లోరి కొండమ్మా అనే వృద్ధురాలు గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తను తలదాచుకుంటున్న పూరి గుడిసె గోడ కూలి తిరిగి నిర్మించుకునే స్తోమత లేక ఆర్థిక ఇబ్బందులతో నిత్యవసరాలకు ఇబ్బంది పడుతూ రోదిస్తూ ఉండడంతో అది గమనించిన గూడెం కొత్త వీధి మీడియా మిత్రుల సంఘం తరఫున మానవత్వం చాటుకుంటూ బియ్యం,కూరగాయలు నిత్యవసర వస్తువులు జిల్లా మైనారిటీ అధ్యక్షుడు అబ్దుల్ మసీద్ చేతులమీదుగా ఆమెకు అందించారు. ఈ కార్యక్రమంలో జి కే వీధి మీడియా సంఘం అధ్యక్షులు శ్యామ రమణ, లక్ష్మణ్, రామ్మోహన్,విజయ్ చంటిబాబు, ధారబాబు, రాజ్ కుమార్, లక్ష్మణ్ రావు, ఉమా మహేష్, బుజ్జి, శివకుమార్, చిన్నారావ్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు