Breaking News

కొయ్యూరు: వైసీపీ నేతలపై టిడిపి నేతలు మండిపాటు. బహిరంగ చర్చకు మేము సిద్ధం? మీరు సిద్ధమా?: టీడీపీ నేతలు

0 20

 కొయ్యూరు:మీ పార్టీయే దొంగల పార్టీ,

మీరు మాట్లాడే మాటలు కూడా దొంగ మాటలే,

బహిరంగ చర్చకు మేము సిద్ధం? మీరు సిద్ధమా?: టీడీపీ నేతలు 

వైసీపీ నేతలపై, టిడిపి నేతలు మండిపాటు.


అల్లూరి సీతారామరాజు జిల్లా:

 తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎంపిటిసి శివరామ్ దగ్గర ఉండి కించవానిపాలెంలో మీ ఎంపీపీ బడుగు రమేష్ ఇంటి ముందున్న CC రోడ్ వేయిస్తే బడుగు రమేష్ వేయించాడు అనడానికి సిగ్గులేదా అని కొయ్యూరు మండలం టిడిపి నేతలు అన్నారు. మీ పార్టీ దొంగ హామీలు పార్టీ..మీరు దొంగ మాటలు మాట్లాడకండని,మీరు మంప,రేవళ్ల కి రెండు కోట్లు పెట్టి రోడ్లు వేసాము అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా?

మీ ఎంపీపీ బడుగు రమేష్ ఉన్న మంప పంచాయితీలో, మీ ఎంపీపీ ఉన్న ఒక కించవానిపాలెం గ్రామంలో 

80 లక్షల రూపాయలు రిజర్వాయర్ పనులు,పంట కాలువ,డ్రైనేజీలో పనులు చేయించి ఎంపీపీ బడుగు రమేష్ ఇంటి ముందు 20 లక్షల రూపాయలు సిసి రోడ్డు వేయించామని వారు తెలిపారు.

మీ ఒక్క గ్రామానికే కోటి రూపాయలు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదని, రెండు పంచాయతీలకి రెండు కోట్లు పెట్టామని చెప్పుకుంటున్న మీరు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారన్నారు.

అదే మంప పంచాయతీలో మంప నుంచి గంగవరం, ఆకులపాడు, చిక్కుడుపాడు గ్రామాలకు, అదే మంప నుంచి రేవళ్లు పంచాయితీకి మెటల్ రహదారి అప్పటి తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిడ్డి ఈశ్వరి ఎమ్మెల్యేగా ఉన్నపుడు వేసినవే అన్నారు.

ఏమయ్యా మీరేమైనా వైయస్ఆర్ పార్టీలో మమ్మల్ని అందలమెక్కిస్తే మేము పార్టీని మోసం చేసి వేరే పార్టీకి పోయామా.. మా గురించి చెప్పుకోవడానికి

మేము అందలమెక్కినప్పుడు ఏ పార్టీలో ఉన్నామో ఈరోజు కూడా అదే పార్టీలో ఉన్నామని అన్నారు.

మరి వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ నువ్వు చేసింది ఏంటయ్య.. పసుపులేటి బాలరాజు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెనకాలే ఉండి అతని వల్ల అందలమెక్కిన మీరు బాలరాజు తో పాటు జనసేన పార్టీలోకి వెళ్లి, బాలరాజు నామినేషన్ వేసిన తర్వాత మిమ్మల్ని అందలం ఎక్కించిన వ్యక్తిని కాదని భాగ్యలక్ష్మి తో వచ్చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు.

తోట దొరబాబు అనే వ్యక్తి ఈ మండలానికి ఏం చేశాడు అని అడుగుతున్నారు. సిగ్గు వేయటం లేదా అలా మాట్లాడడానికి,తోట దొరబాబు అనే వ్యక్తి ఈ మండలానికి ఏ పదవులు చేశాడయ్యా పదవులు చేస్తే నువ్వు పదవులు చేసినప్పుడు ఈ మండలాన్ని నువ్వు ఏం చేశావు అని ప్రశ్నించండి మేము సమాధానం చెప్తాం.ఎవరిని ఏ ప్రశ్న అడగాలో ఎవరిమీద ఏమి స్టేట్మెంట్ ఇవ్వాలో చేతగాని దద్దమ్మలు మీరు అని కొయ్యూరు మండల వైసీపీ నేత నేతలపై మండిపడ్డారు.

 మీ వైయస్సార్ ఎంపీటీసీ అంగన్వాడీ పోస్టు అమ్మేసుకున్నారు అని పార్టీకి రాజీనామా చేస్తాను అని కొయ్యూరు ఎంపీటీసీ పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వలేదా? 

మీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ మీద ఇచ్చిన స్టేట్మెంట్ కి మేము సమాధానం ఇచ్చామని దుయ్యబట్టారు.99% మా వాగ్దానాలు పూర్తి చేసాం అని మీరు చెప్పారు. దానికోసం మేము అడిగామని, ఎక్కడ పూర్తి చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు నియోజకవర్గంలో ఒక్క పక్కా ఇల్లు అయినా కట్టించారా? ఒక్క బాత్రూమ్ అయినా కట్టించారా?

పాత పెండింగ్ హౌసింగ్ బిల్లు అయినా ఇచ్చారా? దీనికి సమాధానం చెప్పండి అని ప్రశ్నించారు.

మీరు దొంగ మాటలు చెబుతున్నారు కదా.. రండి మీ ఎంపీపీ వాళ్ళ గ్రామం వెళ్లి ఆ సీసీ రోడ్డు మీద కూర్చొని అక్కడే మాట్లాడుకుందాం.. ఆ రోడ్డు మీ ఎంపీపీ రమేష్ బాబు వేయించారా.. మా ఎంపీటీసీ శివరామ్ వేయించారా బహిరంగ చర్చకు మేము సిద్ధం. రేపు రండి మంప పంచాయతీ కించవానిపాలెం.. అని వైసీపీ నేతలపై, టిడిపి నేతలు సవాలు విసిరారు.

వ్యక్తిగత విమర్శలు మాని మేము అడిగిన దానికి సమాధానం చెప్పండని వారన్నారు.

ఈ సందర్భంగా కొయ్యూరు మండల పార్టీ అధ్యక్షుడు గొలిసింగి సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు,ఉపాధ్యక్షులు ఉల్లి వెంకటేశ్వర్లు,ST సెల్ కార్యదర్శి కొర్రు రామమూర్తి,కార్యదర్శి పుష్పలత,సీనియర్ నాయకులు కొర్రు పుల్లయ్య,నిమ్మల నాగేశ్వరరావు,సన్యాసిరావు,చేవల ప్రసాద్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.