మేనల్లుడు పుట్టిన రోజు సందర్భంగా వృధ్ధులకు చీరలు పంపిణీ చేసిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెం లో శుక్రవారం ఎంపీ సోదరుడైన మహేష్ తనయుడి పుట్టిన రోజు సందర్భంగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వృధ్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భర్త నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్,ఎంపిపి బడుగు రమేష్ బాబు,ఎంపీటీసీ బిడిజన అప్పారావు,సర్పంచ్ లు,పార్టీ కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.