Breaking News

ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని జికె.వీధి లో బీజేపీ నాయకులు సేవకార్యక్రమాలు.

0 38

 ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని జికె.వీధి లో బీజేపీ నాయకులు సేవకార్యక్రమాలు. 


 
అల్లూరి సీతారామరాజు జిల్లా,జికె వీధి మండలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 72సం,,పూర్తి చేసుకుని 73 వసంతాల జన్మదినం అడుగు పెడుతున్న సందర్బంగా బీజేపీ పార్టీ పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చూడుతూ మండల పరిధి జికె.వీధిలో స్వచ్చ భారత్, హాస్పిటల్ లో రోగులకు పాలు,బ్రెడ్,పండ్లు పంచడం జరిగింది.

17నుండి 2వ తారీఖు వరకు సేవాకార్యక్రమాలు విధిగా నిర్వహించడం జరుగుతుందని జికె వీధి బీజేపీ మండల అధ్యక్షులు వనపల జోగిరాజ్ తెలిపారు.మోడీ జన్మదిన సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ బోండ్ల చిరంజీవి, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దుక్కేరి ప్రభాకర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కాకూరి శేఖర్, జిల్లా యువమోర్చ కార్యదర్శి మొట్టడం లక్ష్మణ్,జికె.వీధి 1 ఎంపీటీసీ రీమల రాజేశ్వరి, కార్యవర్గ సభ్యులు త్రినాధ్, మండల యువ మోర్చా ప్రెసిడెంట్ లకే ప్రసాద్,లకే రాము, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.