Breaking News

ఏవోబీలో 700 మంది మావోయిస్టు మ‌ద్ద‌తుదారులు లొంగుబాటు.లొంగిపోయిన వారిలో 300 మంది మావోయిస్టు మిలీషియా స‌బ్యులు.

0 19

 ఏవోబీలో 700 మంది మావోయిస్టు మ‌ద్ద‌తుదారులు లొంగుబాటు

లొంగిపోయిన వారిలో 300 మంది మావోయిస్టు మిలీషియా స‌భ్యులు.


ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో క‌టాఫ్ ఏరియాలో సుమారు 700 మంది మావోయిస్టు మ‌ద్ద‌తుదారులు శ‌నివారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 300 మంది మావోయిస్టు మిలీషియా స‌భ్యులు ఉన్నారు. శ‌నివారం క‌టాఫ్ ఏరియాలో అండ్ర‌హాల్ బీఎస్ఎఫ్ క్యాంపులో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పోలీసుల ముందు లొంగిపోయారు. కోరాపుట్ డీఐజీ రాజేష్ పండిట్‌, మ‌ల్క‌న్‌గిరి ఎస్‌పీ నితేష్ వాధ్వాని, బీఎస్ఎఫ్ డీఐజీ మ‌ద‌న్‌లాల్ లు ముఖ్య అతిథులుగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో  ప‌లు పంచాయ‌తీల‌కు చెందిన గిరిజ‌నుల‌తో బాటు ఏపీలోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లా ముంచింగ్‌పుట్ స‌రిహ‌ద్దు గ్రామాల‌కు చెందిన గిరిజ‌నులు పోలీసుల ముందు లొంగిపోయారు. పోలీసులు ఇటీవ‌ల ఏర్పాటు చేసిన ఘ‌ర్‌వాప‌సీ కార్య‌క్ర‌మానికి ఆక‌ర్షితులై లొంగిపోయారు. లొంగిపోయిన గిరిజ‌నుల‌కు చెందిన గ్రామాల‌న్నీ మావోయిస్టుల‌కు బ‌ల‌మైన కోట‌గా ఉండేవి. వీరి అనేక హింసాత్మ‌క కార్య‌క్ర‌మాల‌కు మావోయిస్టుల‌కు స‌హ‌క‌రించేవారు. పోలీసులు ఇచ్చిన పిలుపు మేర‌కు లొంగిపోయిన మావోయిస్టు మ‌ద్ద‌తుదారులు మావోయిస్టుల‌కు వ్య‌తిరేఖంగా నినాదాలు చేశారు. పోలీసులు చేప‌డుతున్న ప్ర‌జాసంక్షేమ కార్య‌క్ర‌మాలు, అభివృద్ది చూసి పోలీసుల ముందు స్వ‌చ్చందంగా లొంగిపోయినట్లు వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.