Breaking News

కొయ్యూరు: చర్చకు మేము సిద్ధం: టీడీపీ నేతలకు వైసీపీ నేతలు ప్రతి సవాల్.

0 19

 కొయ్యూరు: చర్చకు మేము సిద్ధం: టీడీపీ నేతలకు వైసీపీ నేతలు ప్రతి సవాల్.


అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు మండల వైసీపీ,టిడిపి నేతలు మధ్య వాడి వేడిగా సాగుతున్న వార్.

ఈమధ్య బహిరంగ చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అని టీడీపీ నేతలు, వైసిపి నేతలకు సవాల్ విసిరిన నేపధ్యంలో .. 

చర్చకు వైయస్సార్ నాయకులు సిద్ధం అంటూ వైసీపీ నాయకులు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.

రేపు 19న సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు మీరు చెప్పిన సమయానికి కించవాణిపాలెం లో

మా ఎలక్షన్ మేనిఫెస్టో తో వస్తాం…మీ ఎలక్షన్ మేనిఫెస్టో తో మీరు రండి… అని టిడిపి నాయకులకు వైసీపీ నాయకులు సవాల్ విసిరారు.

సంక్షేమంతో కధం తొక్కాము,అభివృద్ధి తో పాగ వేస్తాము అని మండల వైయస్సార్ నాయకులుగా సవాలు చేస్తున్నామని అన్నారు.

మీకు ప్రజలకు మంచి చేయడం ఎలాగు చేతకాదు. 

జగనన్న అందిస్తున్న ఫలాలు ప్రజలకు అందుతుంటే హర్షించాలి గాని 

విమర్శలు చేయడం ఏ రాజకీయ నీతో అర్థం కావడం లేదు అని విమర్శించారు.

 శత్రువు ను అయినా ప్రేమించాలనేది మా వైయస్సార్ పార్టీ సిద్దాంతం అని, మీలాగ మా పార్టీ నాయకుడు సిద్దాంతం కాదు అని కులం,మతం, పార్టీలు చూడకుండా, అర్హులు అయితే చాలు వాళ్ళ కి పథకం అందించే ప్రభుత్వం మాది అని అన్నారు.

మా ప్రకటనలో అడిగినవి ఒకదానికి అయినా సమాధానం ఇవ్వకుండా దాటివేసారు.కాబట్టి డైరెక్ట్ గా మీ అభివృద్ధి.. మా అభివృద్ధి.. లెక్కలతో సహా సాక్షులు తో సహా మేము సిద్ధంగా ఉన్నాము అని కొయ్యూరు మండల వైసీపీ నేతలు తెలియజేశారు.


Leave A Reply

Your email address will not be published.