Breaking News

వైసీపీ నేతల సవాల్ కి టీడీపీ నేతల వివరణ.మేము అడిగిందేమిటి? మీరు చెబుతున్నదేమిటి?

0 19

 వైసీపీ నేతల సవాల్ కి టీడీపీ నేతల వివరణ.

మేము అడిగిందేమిటి? మీరు చెబుతున్నదేమిటి?



అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం: 

నిన్న 17వ తారీఖున టిడిపి నేతలు వైసిపి నేతలపై ఒక ప్రకటనలో.. బహిరంగ చర్చకు మేము సిద్ధం? మీరు సిద్ధమా? అని సవాల్ విసిరిన నేపధ్యంలో..

ఈరోజు చర్చకు మేము సిద్ధం? అని వైసిపి నేతలు టిడిపి నేతలపై సవాల్ విసిరారు.

అయితే వైసిపి నేతలు విసిరిన సవాల్ కు టిడిపి నేతలు ఈ కింది విధంగా వివరణ ఇచ్చారు.

వైసీపీ నాయకులకు మేము చెప్పేది ఒకటే.. మేము రేవళ్ళ పంచాయితీలో బాదుడే బాదుడు కార్యక్రమానికి వెళ్లి ఒక ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ చేసేదాన్ని మేము వివరించి చెప్పాలి. కాబట్టి కార్యక్రమంలో అక్కడున్న మహిళలకు అధికార పార్టీ చేస్తున్న పథకాల కోసం, మీ ప్రభుత్వం నిత్యావసర రేట్లు పెంచి ఆ డబ్బులను తిరిగి ఎలా లాగేస్తున్నారు అనేది వివరిస్తున్నాం.అది మా బాధ్యత అని అన్నారు.

మీ ఎంపీపీ బడుగు రమేష్ బాబు మేము చేసిన అభివృద్ధి మీకు కనిపించట్లేదా అని మా మీద, మా పార్టీ మీద వ్యక్తిగతంగా మాట్లాడారు.

దానికి మేము అభివృద్ధి మీరే చేసినట్టు, తెలుగుదేశం పార్టీలో అసలు ఏం చేయలేనట్టు మాట్లాడుతుంటే, మీ మంప పంచాయతీలో, మీ గ్రామంలో మేం చేసిన అభివృద్ధి కోసం మీ ఇంటి ముందున్న సిసి రోడ్డు కోసం స్టేట్మెంట్ ఇచ్చామని తెలిపారు.

దానికి మీరు.. మీ ఇంటి ముందున్న సిసి రోడ్డు తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకుంటే, మా ఎంపీపీ బడుగు రమేష్ బాబు అధికారులతో మాట్లాడి వేయించుకున్నారు అంటున్నారు.

దానికి మేము మీకు సవాల్ చేసామని,ఎంపీపీ ఇంటి ముందర రోడ్డు మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంప పంచాయతీలో మా ఎంపీటీసీ శివరామరాజు ఉన్నప్పుడు ఆయనే దగ్గరుండి రోడ్డు వేయించారు అని చెప్పామని,

మీరు రెండు పంచాయితీలకే రెండు కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసాము అంటున్నారు.

మేము మీ ఒక్క గ్రామానికే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోటి రూపాయలు పెట్టామని చెబుతున్నామని టిడిపి నేతలు అన్నారు.

మీ యొక్క గ్రామానికి మేము కోటి రూపాయలు ఖర్చు పెట్టలేదా అని ప్రశ్నించారు. మీ ఎంపీపీ ఇంటి ముందున్న రోడ్డు మీరే వేయించుకున్నారు అంటున్నారు, మేము వేయించాము అని చెబుతున్నాం.. దానిమీద చర్చకి రండి అని కొయ్యూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులుగా అంటున్నామని అన్నారు.

మీ మేనిఫెస్టో కోసం మేము అడగలేదని,

మీ మేనిఫెస్టో కోసం మాట్లాడితే చాలా ఉన్నాయని 

రాజధాని,

పోలవరం ప్రాజెక్టు,

ప్రత్యేక హోదా,

రైల్వే జోన్,

ఉద్యోగులకు ఇచ్చిన హామీలు(సీపిఎస్ రద్దు) ఇంకా చాలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు దుయ్యబట్టారు.

అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంప పంచాయితీ ఎంపీటీసీ

శివరామరాజు,మంప సర్పంచ్ జర్తా రాజబాబు ఉన్నప్పుడు వేసిన రోడ్డు అని 

అప్పుడే మీ గ్రామానికి కోటి రూపాయలు ఇచ్చామని మేము చెబుతున్నామని,

దానికోసం మేము అడిగితే.. ఈరోజు మీరు కొత్తగా మేనిఫెస్టో తెచ్చుకోండి అంటున్నారు. మేము అడిగిందేమిటి, మీరు చెబుతున్నది ఏమిటని టిడిపి నేతలు అన్నారు.

ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ కి వెళ్ళాలి అన్న విషయాన్ని వైసిపి పెద్దలు,నాయకులు తెలుసుకోవాలని,

రాష్ట్రం మేనిఫెస్టో వరకు అవసరం లేదు.. ముందు మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలు మాత్రం సమాధానం చెప్పగలరా అని అన్నారు.

గిరిజన ప్రాంతంలో 45 సంవత్సరాలకు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని, గిరిజన ప్రాంతంలో గిరిజనులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి అన్న జీవో నెంబర్ త్రీ ని ఎందుకు తీసేసారు అని, ప్రతి సంవత్సరం గిరిజన పేదవాడి పిల్లలకు వందలాది మందికి కార్పొరేట్ స్కూల్ నందు ప్రవేశాలు ఎందుకు తీసేసారు వీటికి సమాధానం చెప్పాలని వైసీపీ నేతలను ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.