Breaking News

టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఎంపీపీ.

0 20

 టిడిపి నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ నేతలు.

అల్లూరి జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో వైసిపి నేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.


ఈమధ్య అభివృద్ధి అనే అంశంపై టిడిపి, వైసిపి పార్టీల నేతల మధ్య నువ్వా నేనా అనేంతలా ఒక పార్టీపై మరొకరు విమర్శల పరంపర కొనసాగింది.అయితే ఈనెల 17వ తేదీన మండల టిడిపి నాయకులు బహిరంగ చర్చకు మేము సిద్ధం? మీరు సిద్ధమా? అని ఇచ్చిన ప్రకటనపై, వైసిపి నేతలు స్పందిస్తూ చర్చలకు మేము సిద్ధం అని ప్రతి సవాల్ చేసి ఈనెల 19వ తారీకు సోమవారం కొయ్యూరు మండలంలోని కించవానిపాలెంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటామని,చర్చకు రావాలని తెలిపారు.

ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ మండల నాయకుల పిలుపు మేరకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని, మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి,కించవానిపాలెం చేరుకున్నారు.వారు చెప్పినట్టు గానే మూడు గంటల వరకు కించవానిపాలెంలో ఉన్నప్పటికీ టిడిపి నేతలు రాకపోవడంతో, ఇంత మాత్రానికే బహిరంగ చర్చకు మేము సిద్ధమని స్టేట్మెంట్లు ఇవ్వడం దేనికని టిడిపి నేతలపై ఎంపీపీ బడుగు రమేష్ తో పాటు పలువురు వైసీపీ మండల నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Leave A Reply

Your email address will not be published.