Breaking News

ముఖ్యమంత్రిని కలిసిన అరకు ఎంపీ.

0 21

 అసెంబ్లీ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అరకు ఎంపీ.



విజయవాడ:తాడేపల్లిగూడెం,అసెంబ్లీ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలను ప్రస్తావించిన అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి.


ఈ సందర్భంగా ఎంపీ.. సీఎం తో పలు అంశాలను ప్రస్తావిస్తూ..ఆదివాసి భాషా వాలంటీర్లను రెన్యూవల్ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.


2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కోర్టు క్లియరెన్స్ తో కొంతమందికి నియామక పత్రాలు అందినా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందలేదని తెలిపి వారికి న్యాయం చేకూరు విధంగా త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు.


గురుకుల కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ఫ్యాకల్టీని నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


పాఠశాలలో నాలుగవ తరగతి ఉద్యోగస్తులను త్వరితగతంగా నియమించాలని పేర్కొన్నారు.


ఈ అంశాలకు గాను సీఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ మాధవి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.