Breaking News

ఉప ముఖ్యమంత్రి దృష్టికి ఫీల్డ్ అసిస్టెంట్స్ సమస్యలు.

0 19

 ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు దృష్టికి ఫీల్డ్ అసిస్టెంట్స్ సమస్యలు తీసుకువెళ్లిన యూనియన్ నాయకులు.


 ఈరోజు రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్స్ సమస్యలు పై ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి బూడి ముత్యాల నాయడు ని


రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ కలవడం జరిగిందని ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బల్లా ప్రసాద్ తెలియచేయడం జరిగింది.


16 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా.. నేటికీ జీతాలు 5748రూపాయులుగా ఉన్నాయని అన్ని ధరలు పెరగడం,కూలీ రేట్లు కూడా పెరగడం వలన బ్రతుకును ఈడ్చడం చాలా దయనీయంగా మా బ్రతుకులు మారాయని…మహిళాఫీల్డ్ అసిస్టెంట్స్ కొండ ప్రాంతంలో పనులు చేసేటప్పుడు రక్షణ కరువై ప్రాణాలు సహితం లెక్క చేయకుండా కరోన కాలంలో రాష్ట్ర పని దినాలు టార్గెట్ పూర్తి చేసి దేశంలో ప్రథమ స్థానంలో ఉండే విధంగా,మీ యొక్క సహాయ సహకారాలతో చేయగలిగామని…ఎలాంటి ప్రతికూల పరిస్థితులలో అయినా ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకుంటూ, ముందుకు‌వెళ్ళి విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.మాకు తక్కువ వేతనాలతో కుటుంబ పోషణ కరువుఅయిందని, ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆరోగ్య, వైద్య,నిత్యావసర ధరలు, పెట్రోల్ పెరుగుదల కారణంగా,మా యొక్క మద్యతరగతి,కుటుంబాల్లో చాలీ చాలని జీతాలతో,ఆర్థిక భారం బరువయిందని,కావున పెరుగుతున్న జీవన విధానం దృష్ట్యా,కనీస వేతనం,ఉద్యోగ భద్రతా,బదిలీ సౌకర్యం, అలాగే మున్సిపాలిటీ పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్స్ ను కొనసాగించి,మా బ్రతుకులలో వెలుగులు నింపాలని,తద్వారా ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మంత్రి ని కోరటం జరిగిందని రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ నాయకులు తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ నాయకులు 

యర్రంశెట్టి కృష్ణ మూర్తి,బల్లా ప్రసాద్,మోహన్,సత్యనారాయణ,సత్యవతి,సత్యం

 26 జిల్లాల నాయకులు కలిసారు.

Leave A Reply

Your email address will not be published.