Breaking News

ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టిన కొయ్యూరు,మంప ఎస్ఐలు.

0 20

 మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టిన కొయ్యూరు,మంప ఎస్ఐలు.


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:


ఈనెల 21 నుండి జరగనున్న మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం మంప ఎస్సై లోకేష్ కుమార్, కొయ్యూరు ఎస్ఐ రాజారావు తమ సిబ్బందితో కలిసి బూధరాళ్ల జంక్షన్ వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు.


ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి విడిచిపెట్టారు.మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కొయ్యూరు, మంప ఎస్ఐలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.