Breaking News

గిరిజన చట్టాల కోసం మాట్లాడేది మీరా ఈశ్వరమ్మా?:ఆదివాసీ జెఏసి

0 19

 గిరిజన చట్టాల కోసం మాట్లాడేది మీరా ఈశ్వరమ్మా?:ఆదివాసీ జెఏసి

గిరిజన చట్టాల కోసం మాట్లాడేది మీరా ఈశ్వరమ్మా అని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు ఎద్దేవా చేసారు.గిరిజన ప్రాంత హక్కులు,చట్టాలు కాపాడడమే లక్ష్యమన్న పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ప్రకటనపై స్పందిస్తూ మాజీలైపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ పలికే పలుకులు ఇలాగే ఉంటాయని, ప్రస్తుత పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి మాజీ అయిన తర్వాత కూడా ఇలాగే పలుకుతారని,గిడ్డి ఈశ్వరి పాడేరు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు గిరిజన చట్టమైనా భూబదాలయింపు నిషేధ చట్టం అమలు చేయించారా,చేయించవలసిన బాధ్యత గిరిజన ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరీకి లేదా అని ప్రశ్నిస్తూ,ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గూడెం సెంటర్లో ఒక గిరిజనేతరుడు భూబదాలయింపు నిషేధ చట్టానికి వ్యతిరేఖంగా ఇల్లు కడుతుంటే తహాశీల్ధార్ అడ్డుకొనగా,ఎమ్మెల్యే గా ఈశ్వరీ పాడేరు నుండి గూడెం వచ్చి రాత్రంతా గూడెంలోనే ఉండి ఆ ఇంటి స్లాబును వేయించిన ఘనత గిడ్డి ఈశ్వరికాదా అని,చింతపల్లిలో ఒక గిరిజనేతరుడు ఇల్లు వదిలి మైదాన ప్రాంతానికి పోతే,ఆ ఇల్లు పాడైపోయి పడిపోతే,ఖాళీగా ఉన్న ఆ స్థలంలో ఒక గిరిజనుడు పాక వేసుకోగా,ఆ పాకను పీకించి మైదానంలో ఉన్న గిరిజనేతరుడికి ఇప్పించిన ఘనత గిడ్డి ఈశ్వరిది.జికె వీధి మండలం ఏబులంలోగల నల్లరాయి క్వారీ తవ్వకాల కోసం ప్రయత్నం చేయలేదా అని,సురవరంలో లేటరైట్ తవ్వకాల కోసం ప్రయత్నం చేయలేదా అని ప్రశ్నిస్తూ,ఆదివాసీ జెఏసి ఆదివాసీలను ఆదివాసీ హక్కుల మీద అవగాహన కల్పిస్తుంటే తమ మనుగడకు నష్టం జరుగుతుందని ఊహించిన రాజకీయ నాయకులు బెంబేలెత్తి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు,కానీ చరిత్ర మారిపోదుకదా అని ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.