అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బాలారం పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కోటి రూపాయలతో నిర్మించనున్న అదనపు డిజిటల్ తరగతి గదులకు ఇతర పనులకు బుధవారం ప్రధాన ఉపాధ్యాయలు వసంతరావు, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది, విద్యాకమిటి చైర్మన్ శ్రీనుతో కలిసి గ్రామ సర్పంచ్ అప్పన అప్పలనర్స భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
అనంతరం సచివాలయంలో ఉన్న సిబ్బంది, వాలంటీర్లతో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి గ్రామంలో అధికారుల ద్రుష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిశీలించాలని,తమ వల్ల కాని సమస్యలను తన ద్రుష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వ్యక్తిగత సహాయకుడు ఆనంద్ పాల్గొన్నారు.