Breaking News

అధికార,ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు,సవాల్ చేసుకోవడం తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదు:జనసేన పార్టీ నేతలు.

0 20

 అధికార,ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు,సవాల్ చేసుకోవడం తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదు: జనసేన పార్టీ నేతలు.


అధికార వైసీపీ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు,సవాల్ చేసుకోవడమే తప్ప ప్రజల బాగోగులు గురించి పట్టించుకునే నాయకులే లేరని జనసేన పార్టీ నేతలు మీరు ఇరువురిపై దుయ్యబట్టారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి రహదారినే పట్టించుకోని ఇరు పార్టీల నాయకులు ప్రజలను ఏమి ఉద్ధరిస్తారని జనసేన పార్టీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. టిడిపి కావచ్చు,వైసీపీ కావచ్చు మీ సొంత నిధులతో ప్రజలకు ఏమి ఉద్ధరించటం లేదని, ప్రజలు కట్టే పన్నులతోనే కొంతమేర చేసి అభివృద్ధి అంటున్నారు తప్ప, ప్రజలకు చేసేది ఏమీ లేదని, ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని, మూడవ ప్రత్యామ్నాయ పార్టీ అయినా జనసేన పార్టీని ప్రజలు గెలిపించే దిశగా ఉన్నారని, ప్రజల పక్షాన నిలబడే పార్టీ జనసేన పార్టీ అని కొయ్యూరు మండల జనసేన పార్టీ నేతలు సాగిన బుజ్జి బాబు,లక్ష్మణ్,సిద్దు,నాని శ్రీను,రాజబాబు,ప్రకాష్ తదితర జనసైనికులు అన్నారు.


Leave A Reply

Your email address will not be published.