Breaking News

మొట్టడం రాజుబాబూ…గిడ్డి ఈశ్వరి అంటే నీకు వ్యక్తిగత కక్ష? లేక ఎవరైనా ఇచ్చిన స్క్రిప్టా?

0 21

మొట్టడం రాజుబాబూ.. గిడ్డి ఈశ్వరి అంటే నీకు వ్యక్తిగత కక్ష?

లేక ఎవరైనా ఇచ్చిన స్క్రిప్టా?

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం:

మొట్టడం రాజుబాబూ.. నీవు ఆదివాసీ జెఏసి గా ఎవరి స్వలాభం కోసం పనిచేస్తున్నావని,నీ స్వార్థ రాజకీయం కోసం జేఏసీ ని అడ్డుపెట్టుకొని పని చేయొద్దని కొయ్యూరు మండల టిడిపి నేతలు మండిపడ్డారు.

 మీరే కాదు మా నాయకురాలు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తో సహా మనమందరం గిరిజనులమే.. కానీ ఈరోజు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గానీ, ఎంపీ గాని నీకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు.

ఈరోజు పాడేరు నియోజకవర్గంలో అధికార పార్టీ ముసుగులో గ్రానైట్ క్వారీగాని,ఎర్ర మట్టి క్వారీలు గాని, నల్లరాయి క్వారీలు గాని,హైడ్రో పవర్ ప్రాజెక్టు గాని నీకు కనిపించటం లేదా,.ఒక జెఏసి గా వీటిపై పోరాటం చెయ్యాలని అన్నారు.

ఆరోజు ఎమ్మెల్యే గా గిడ్డి ఈశ్వరి ఉన్నపుడు గిజనుల కోసం గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ కోసం పోరాటం చేసిన ఘనత గిడ్డి ఈశ్వరి దని చెప్పారు.

ఈరోజు మాజీ ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరి ఇదే గిరిజన ప్రాంతం కోసం

జి.మాడుగుల ప్రాంతంలో గాని,చింతపల్లి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం గానీ,

జీవో నెంబర్ త్రీ కోసం గానీ పోరాటం చేసే ఏకైక గిరిజన మహిళ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాత్రమే అన్నారు. 

జెఏసి ఏర్పడక ముందు జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకుని విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

 జేఏసీ ఏర్పడిన తర్వాత నువ్వు దగ్గరుండి పెట్టినటువంటి బినామీ కేసులను ఎంతవరకు పురోగతి సాధించావు. ముందు దాని మీద దృష్టి పెట్టి గిరిజనులకు న్యాయం చెయ్ అంతేగాని నీ వ్యక్తిగత కక్షల కోసం గిడ్డి ఈశ్వరి మీద స్టేట్మెంట్లు ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అయ్యా జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజుబాబూ నీ కక్ష సాధింపు ప్రతిసారి గిడ్డి ఈశ్వరి మీదే ప్రదర్శిస్తున్నావు.. ఆమె మీదే ఎందుకు అంత కక్ష సాధింపు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటి? ప్రస్తుత ప్రజాప్రతినిధులు మన చట్టాలను, హక్కులను కాపాడుతున్నారా?

అయితే రెండు సంవత్సరాల ముందు ఒక సర్పంచ్, ఒక ఎంపీపీ ఇద్దరిపై మూడు తరాల కుల ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోమని మీరు పెట్టిన గ్రామసభలు ఎందుకు. మాట్లాడితే న్యాయం ఉండాలి, మనం చేసే దాంట్లో నిజాయితీ ఉండాలి, అంతేగాని గిడ్డి ఈశ్వరి ఆదివాసి ప్రాంతమంతా అమ్మేసింది, తాకట్టు పెట్టింది అని కక్ష సాధింపు దేనికని వారన్నారు. మీరు మాట్లాడే మాటలను మేము ఖండిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం అనేక లోపాలు కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుత ప్రజా ప్రతినిధులను ఎందుకు నిలదీయలేకపోతున్నారని, మీరు గిడ్డి ఈశ్వరి నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కొయ్యూరు మండల తెలుగు దేశం పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు గొలిసింగి సత్యనారాయణ,రాష్ట్ర ఎస్ టి సెల్ కార్యదర్శి కొర్రు రామ్మూర్తి,రాజేంద్ర పాలెం సర్పంచ్ పిటా సింహాచలం,సీనియర్ నాయకులు కొర్రు పుల్లయ్య,మాజీ సర్పంచ్ సాలేబు సన్యాసి రావు,మాజీ ఎంపీటీసీ కిల్లే బాలరాజు,టి ఎన్ ఎస్ ఎఫ్ అధ్యక్షులు పొట్టుకూరి సన్యాసి రావు, 

చెవల ప్రసాద్,గ్రామ కమిటీ అధ్యక్షుడు నవరంగి వెంకట్రావు ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.