కొయ్యూరు: ఫేక్ యాప్స్,ఫేక్ లింకులు పై ప్రజలకు ఎస్ఐ రాజారావు అవగాహన.
అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం:
ఎం.మాకవరం పంచాయతీ, గ్రామంలో అక్కడి ప్రజలతో.. ఫేక్ యాప్స్, ఫేక్ లింకులు, నాటుసారా పై కొయ్యూరు ఎస్ఐ రాజారావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎవరైనా అనధికారిక వ్యక్తులు మీకు ఫోన్ చేసి యాప్స్ గాని, లింకులు గాని పంపించి వాటిని ఓపెన్ చేయాలని గాని, ఓటిపి చెప్పాలని గాని ఫోన్ లో మాట్లాడితే, ఓటీపీ చెప్పడం, లింకులు ఓపెన్ చేయడం ఇలాంటివి చేయొద్దని, అలా ఓపెన్ చేసినట్లయితే మీ వ్యక్తిగత సమాచారం తెలుసుకొని మీ వద్దనున్న సొమ్మును వారు తీసేసుకోవడం జరుగుతుందని, కనుక ఫేక్ యాప్స్ ని, లింకులను గాని, ఓపెన్ చేయవద్దని, అలాగే మీ పంచాయతీ పరిధిలో ఎవరు నాటు సారా తయారీ క్రయ విక్రయాలకు పాల్పడవద్దని, అలా చేసినట్లయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజారావు తెలిపారు.ఈకార్యక్రమంలో మహిళా పోలీస్ కళావతి పాల్గొన్నారు.